నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ చాలా మందిని కదిలించింది. సినిమాలో టైటిల్ సాంగ్ లేకపోయినా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనే సొంతగా రాసుకుని కంపోజ్ చేసిన ఈ పాట అందరి హృదయాలను తాకింది. నాన్నకు ప్రేమతో అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చిందని చెప్పాలి.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే స్పూఫ్ లు తయారు చేయడం మన దగ్గర ట్రెండ్. కానీ నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజువల్స్ ఉపయోగించి సూపర్బ్ వీడియో తయారు చేశారు కొందరు మెగా ఫ్యాన్స్. తండ్రి చిరంజీవి - చెర్రీ చిన్నప్పటి నుంచి రీసెంట్ టైం వరకూ... కలిసి పంచుకున్న క్షణాలను పొందుపరిచారు. చెర్రీ చిన్నప్పుడు బాక్సింగ్ చేస్తుంటే ఎంకరేజ్ చేయడం స్టెప్పులు వేస్తుంటే వెనుకాల కూర్చుని చప్పట్లు కొడుతూ చిరు ఎంజాయ్ చేయడం.. అందరినీ హత్తుకునే విజువల్స్. అంతే కాదు.. మధ్యమధ్యలో రామ్ చరణ్ తన తండ్రి గురించి మాట్లాడిన మాటలను కూడా పర్ ఫెక్ట్ గా మిక్స్ చేశారు.
'నువ్విచ్చిన దాన్ని చెడగొట్టనని ప్రామిస్ చేస్తున్నాను. నీ అంతో బాబాయ్ అంతో అవాలని కోరకోవడం లేదు' అంటూ చెర్రీ మాటలను వీడియోకి ఫినిషింగ్ లైన్ గా పెట్టడం మరింతగా ఆకట్టుకుంటుంది. ఈ తండ్రీ కొడుకుల నిజ జీవిత అనుబంధాన్ని ఇంత చక్కగా చూపించడాన్ని హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఏమైనా ఓ స్టార్ హీరో సాంగ్ ని మరో స్టార్ హీరో విజువల్స్ తో కలిపి ఇంత పర్ ఫెక్ట్ వీడియో రూపొందించిన వారిని అందరూ అభినందిస్తున్నారు.
0 comments:
Post a Comment