సూపర్ స్టార్ రజనీకాంత్ రోబోటిక్ విన్యాసాల గురించి తెలిసిందే. చిట్టీ క్యారెక్టర్ లో అతడు చేసిన విన్యాసాలు అసాధారణం. విలన్ గా మారాక విరోచితమైన పెర్ఫామెన్స్ చూపించారు రజనీ. అయితే ఇప్పుడు ఆ చిట్టీ క్యారెక్టర్ 2.0లో హైలైట్ గా ఉంటుందని సమాచారం. రోబో -2 కథ లీకైంది. కోలీవుడ్ లో లీకు వీరులు లీక్ చేసిన కథ ఇలా ఉంది మరి.
రోబో చిత్రంలో మూవీ ఎండింగులో కోర్టు ఆదేశాల ప్రకారం.. చిట్టీని పూర్తిగా నాశనం చేసి స్కెలెటిన్ ని మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టేస్తారు. డాక్టర్ వశీకరణ్ ఆ పని చేస్తారు. అయితే 2.0లో ఆ చిట్టీని మళ్లీ బైటికి తెస్తారు వశీకరణ్. ఈసారి ఓ పవర్ ఫుల్ విలన్ రోబో (అక్షయ్ కుమార్)ని ఎదుర్కొనేందుకు చిట్టీ ఈజ్ బ్యాక్ అన్నమాట! అయితే ఇందులో విలన్ రోబోని కూడా వశీకరణే తయారు చేస్తారు. చిట్టీ కంటే డబుల్ స్పీడ్ ఉన్న అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో తయారు చేసిన రోబో చివరికి తన మాట వినకుండా విలన్ల గూటికి చేరుతుంది. అప్పుడు చిట్టీని రీ-మోడిఫై చేయాల్సొస్తుంది. అలా తయారైన చిట్టీ 2.0 అడ్వాన్స్ డ్ రోబో చివరికి విలన్ రోబో పని పట్టిందా? లేదా? విలన్ గ్యాంగ్ ని ఎలా ఢీకొట్టింది? అన్నది తెరపైనే చూడాలి.
దీన్నిబట్టి 2.0 మూవీలో చిట్టీకి విలన్ రోబోకి మధ్య పోరాటాలు అసాధారణంగా ఉంటాయని అర్థమవుతోంది. ముఖ్యంగా రజనీకాంత్ వర్సెస్ అక్షయ్ కుమార్ ఫైట్స్ సంథింగ్ స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారుట శంకర. అసాధారణ శక్తులున్న విలన్ తో చిట్టీ పోరాటం అన్నమాట!
0 comments:
Post a Comment